చరిత్రలో ఈ రోజు
నవంబర్ 19:
- 1828 : మరాఠా యోధుల పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జననం (మ.1858).
- 1917 : పూర్వ భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జననం (మ.1984).
- 1928 : భారతదేశానికి చెందిన ప్రసిద్ధ మల్లయోధుడు మరియు సినిమా నటుడు దారా సింగ్ జననం (మ.2012).
- 1954 : ఆంధ్ర ప్రదేశ్కు చెందిన పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ జననం.
- 1973 : ప్రముఖ భారతీయ నటి షకీలా జననం.
- 1975 : విశ్వ సుందరి పోటీలో విజేతగా ఎన్నుకొనబడి ప్రసిద్ధికెక్కిన భారతీయ నటి సుష్మితా సేన్ జననం.
- 1977: తుపానుయొక్క ఉప్పెన సృష్టించిన భీభత్సానికి ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని దివిసీమ నాశనమయింది.
- 1995 : ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకులు మరియు సంస్కృతాంధ్ర పండితులు రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి మరణం (జ.1908).
- 2007: ప్రసిద్ధ రచయిత, సీమ సిన్నోడు గా పిలువబడే రాయలసీమ వాసి పులికంటి కృష్ణారెడ్డి మరణం (జ.1931).
No comments:
Post a Comment