చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 22:
- 1879: బ్రిటిషు వారు మొట్ట మొదటి రాజద్రోహ నేరాన్ని నమోదు చేసారు. వాసుదేవ బల్వంత ఫడ్కే మొదటి ముద్దాయి.
- 1894 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సంపాదకుడు కోలవెన్ను రామకోటీశ్వరరావు జననం (మ.1970).
- 1900 : భారతీయ స్వంతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ జననం (మ.1927).
- 1934 : పేదల పక్షపాతిగా, నిస్వార్థ సేవకునిగా పేరొందిన మాజీ ఐఎఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ జననం (మ.2010)
- 1949 : ఫ్రాన్సు దేశానికి చెందిన ఒక ఫుట్ బాల్ నిర్వాహకుడు ఆర్సేన్ వెంగెర్ జననం.
- 1963: భాక్రా నంగల్ ఆనకట్టను ప్రధాని నెహ్రూ జాతికి అంకితం చేసాడు.
- 1966: సోవియట్ యూనియన్ లూనా 12 అంతరిక్ష నౌక ను ప్రయోగించింది.
No comments:
Post a Comment